Listen to this article

జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సంఘం లో పద్మశాలి కమిటీ మండల అధ్యక్షులు గా సామల మధుసూదన్ ను ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు చందా మల్లయ్య తెలియజేశారు ఆదివారం రోజున ఎన్నికను నిర్వహించారు మండల కేంద్రానికి చెందిన వంగరి సాంబయ్య కొప్పుల గ్రామానికి చెందిన సామల మధుసూదన్ పోటీలో నిలవగా అధిక మెజార్టీతో సామల మధుసూదన్ గెలుపొందారు ఈ నేపథ్యంలో అధ్యక్షులు గా ఎన్నికైన సామల మధుసూదన్ తన వర్గీయులతో చేనేత సంఘం నుండి అంబేద్కర్ సెంటర్ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన గ్రామ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు పద్మశాలీల సంక్షేమానికి పాటుపడతానని అధ్యక్షులుగా తన మార్క్ చూపుతానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు యాదగిరి రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు బసాని చంద్ర ప్రకాష్ మాందరి పేట అధ్యక్షులు గా బడుగు రవీందర్ ఉపాధ్యక్షులు చందనలా సునీల్ కోశాధికారి గా బడుగు సుధాకర్ మండల నాయకులు వావిలాల వేణుగోపాల్ సభ్యులు బడుగు అశోక్ బడుగు సునీల్ క్యాతం రాజేష్ కందికట్ల ప్రవీణ్ సారంగపాణి తదితరులు పాల్గొన్నారు….