

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల విజ్ఞప్తి చేస్తున్నారు. పలు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ప్రజలు నిత్యవసర సరుకులు కొనుగోలు చేసేయందుకు వస్తూ ఉంటారు.అదే విధంగా ఇతరేతర పనుల నిమిత్తం ప్రజలు నిత్యం గడియార స్తంభం సెంటర్ కి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. గడియార స్తంభం ప్రాంతముఅంతా ఆక్రమణకు గురై ఉంది. కనీసం ప్రయాణికులు నిలబడలేని పరిస్థితి నెలకొని ఉంది.. బస్సులు, ఆటోలు,ఇతర వాహనాలు నడిరోడ్డు మీద ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. దీనివలన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలు తొలగించి బస్సు షెల్టర్ ఏర్పాటు చేసి వేసవికాలంలో బారినుంచి ప్రయాణికులను కాపాడలని పలువురు ప్రజలు అధికారులను కోరుతున్నారు.