

జనం న్యూస్ మార్చ్ 11అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మండలం లోని మూలపేట గ్రామం వద్ద శారదానది అనుకోని ఉన్న అనకట్టు నాగుల పల్లి గ్రోయిన్ శిదిలావ్యవస్థ కు చేరి నదిలో ఉన్న నీరంతా వృధాగా సముద్రం పాలువుతుందని తక్షణమే మరమ్మత్తులు చేసి ప్రజలు కు త్రాగునిరు, రైతులకు సాగు నీరు అందించాలని గ్రామ అభివృద్ధి పోరాట కమిటి కన్వీనర్ కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. ఈమేరుకు ఆర్ డి వో కార్యాలయం లో స్పందన కార్యక్రమంలో ఏ వో కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రోయిన్ పై అనేక సార్లు పలు రూపంలో అధికారులు కు పిర్యాదు లు చేసిన పట్టించి కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రోయి న్ పై అనకాపల్లి పట్టణం తో పాటు 10గ్రామాలు ప్రజలు, రైతులు ఆధారపడి ఉన్నారని రానున్న , ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎమ్మెల్యే, కొణతాల రామకృష్ణ, సంబందించిన అధికారులు గ్రోయిన్ మరమ్మత్తులు చేయాలని, లేకుంటే గ్రామస్తులు, రైతులు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఆందోళన లు చేస్తాం అని తెలిపారు. కార్యక్రమం లో వాయి బోయిన శేఖర్, చిన్ని సత్తిబాబు, మారేడి పూడి సత్యనారాయణ, వై సాయిబాబు పాల్గొన్నారు.//