



ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జనం న్యూస్ మార్చి 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) 33 జిల్లాలలో ఏ కలెక్టర్ చేయని విధంగా ఎస్సీ,ఎస్టీల సమస్యల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ అని ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ల్యాండ్, సర్వీస్ మరియు అట్రాసిటీస్ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు పై జిల్లా అధికారులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులు చర్చించారు. రాష్ట్రంలో ఏ జిల్లా కూడా శాఖల వారిగా ఎస్సీ ఎస్టీ సంక్షేమంపై కమిషన్ చైర్మన్ కు పిపిటి ద్వారా ఎస్సీ ఎస్టీలకు అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం రాష్ట్రంలో మరెక్కడ జరగలేదని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. జిల్లా లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ పనితీరును చైర్మన్ కొనియాడారు. సమావేశ అనంతరం ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య ,సభ్యులు రాంబాబు నాయక్ ,జిల్లా శంకర్, కే. నీలాదేవి, లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ తేజస్ ను ఘనంగా సన్మానించారు. కలెక్టర్ పనితీరుపై సభ్యులు కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎస్పీ కే నరసింహ,అదనపు ఎస్పీ నాగేశ్వరావు,కమిషన్ సభ్యులు రాములు నాయక్, శంకర్, ఎస్ సి అభివృద్ధి అధికారి లత, ఎస్ టి అభివృద్ధి అధికారి శంకర్, ఎస్ సి కార్పొరేషన్ ఈ డి శ్రీనివాస్ నాయక్, యల్ డి యమ్ బాపూజీ,జి యమ్ సీతారాం నాయక్,డి ఎస్ పి లు, ఆర్డీఓ లు, తహసీల్దార్ లు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.