

జనం న్యూస్ జనవరి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఎవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ను నమ్మి మోసపోయిన కొందరు గ్రామీణ ప్రాంతా విద్యార్థులు గత నెల 22’వ తారీఖున బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని ఆశ్రయించగా విద్యార్థుల దగ్గర నుంచి వివరాలు తెలుసుకుని, సదరు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ యజమానిని పిలిచి డబ్బులు తీసుకొని అవకాశాలు కల్పించకపోగా వారిని మోసం చేసినందుకు విద్యార్థులకు క్షమాపణ చెప్పి వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులను తిరిగి ఇచ్చేయాలని తెలియజేశారు, సదరు యజమాని యాబై శాతము డబ్బులు తిరిగి ఇవ్వడానికి అంగీకరించి ఈరోజు విద్యార్థులకు చెల్లించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిర పడదామని ఎంతో ఆశతో అప్పు చేసుకొని మరి ఫీజులు కడితే, తెలియని ప్రాంతంలో మోసపోయామని గ్రహించి బాధపడుతున్న సమయంలో పెద్దన్న లాగా మా సమస్యపై స్పందించి మాకు న్యాయం చేసినందుకు వడ్డేపల్లి రాజేశ్వరరావు కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేసినటువంటి ఈ సహాయానికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు. ధన్యవాదాలు రాజేశ్వర్ రావు అని అన్నారు. అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టించి వారి తిరుగు ప్రయాణానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు