

జనం న్యూస్ మార్చ్ 12 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా గా ఐదు సంవత్సరాలు అవకాశం కల్పించిన ప్రజలకు నిరంతరం రుణపడి ఉంటానని అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ అన్నారు. మంగళవారం నాడు అమీన్పూర్ మున్సిపాలిటీ 12వ వార్డులోని జయలక్ష్మి నగర్ ఫేస్ 2 కాలనీవాసులు ఏర్పాటుచేసిన ఆత్మీయ అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగాకాలనీవాసులు నరసింహ గౌడ్ కు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింహ గౌడ్ మాట్లాడుతూ కాలనీ ప్రజల మౌలిక వసతుల కోసం వారి సమస్యలే లక్ష్యంగా నిరంతరం పనిచేశానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జయలక్ష్మి నగర్ ఫేస్కా 2 లనీ అసోసియేషన్ కమిటీ సభ్యులు పలువురు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.