

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 13, (రిపోర్టర్ ప్రభాకర్): గిరిజన విద్యార్థులు మరణాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఏ ఎన్ ఎమ్ ల నియామకం దస్త్రం పై మొదటి సంతకం పెట్టామని ప్రకటించిన గిరిజన సంక్షేమం శాఖ మంత్రి, ఎప్పుడు ఏ. ఎన్. ఎమ్ లను నియమిస్తారని గిరిజన సంక్షేమం సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు గతంలో గిరిజన విద్యార్థులకు వైద్య సేవలు అందించిన “ఆదివాసీ ఆరోగ్యం” సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
గురువారం పార్వతీపురం గిరిజన సామాజిక భవనం లో జరిగిన సమావేశంలో రంజిత్ కుమార్ మాట్లాడుతూ
గతంలో గిరిజన విద్యార్థులకు వైద్య సేవలు అందించిన ఆదివాసీ ఆరోగ్యం సిబ్బంది ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మే ప్రస్తుత ప్రభుత్వం చేయడం మంచిది కాదని అన్నారు. గిరిజన విద్యార్థుల మరణాలు నివారణకు ఆదివాసీ ఆరోగ్యం సిబ్బంది అవసరం అన్నారు.
ఆదివాసీ ఆరోగ్యం సిబ్బంది సేవలు నిలుపుదల తర్వాత గిరిజన విద్యార్థుల మరణాలు పెరిగాయని తెలిపారు.
ఈ సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పల్ల సురేష్, గిరిజన సంక్షేమం సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షులు తాడంగి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
