

జనం న్యూస్ మార్చి 13(నడిగూడడెం) రేషన్ బియ్యం కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ వరకే రేషన్ దుకాణాలకు బియ్యం చేరడంతో పాటు పంపిణీ కూడా ప్రారంభమయ్యేది. ఈ నెల లో ఇప్పటివరకు రేషన్ బియ్యం రాలేదు. నడిగూడెం మండల ప్రజలు రేషన్ దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.