


జనం న్యూస్ // మార్చ్ // 13 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
కరీంనగర్ జిల్లా..హుజురాబాద్ నియోజకవర్గం.. జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఒకే నెలలో పదిమంది పై బడి మృతి చెందినారని గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళితే గ్రామస్తులు అందరూ కలిసి తెల్లవారక ముందే గురువారం రోజున అందరూ కీడు వంటలకు వెల్లారు. దాదాపు ఒకే నెలలో ఊరిలోని ప్రజలు, పదిమంది పైబడి చనిపోయినారు, అని గ్రామస్తులు అందరు కలిసి అయ్యగారును, అడగగా గ్రామానికి కీడు సోకింది అని అందరూ తెల్లవారకముందే కీడు వంటలకు వెళ్లి అక్కడే వండుకొని తిని చీకటి పడ్డాక గ్రామంలోకి రావాలని అయ్యగారు తెలిపారాని గ్రామస్తులు వాపోయారు. గతంలో కూడా ఇలాగే జరగగా చాలామంది చనిపోగా గ్రామస్తులు అందరం కలిసి కీడు వంటలకు వెళ్లడం జరిగింది అని అప్పటి నుండి అంతా బాగానే ఉంది అని మళ్ళీ ఇప్పుడు ఈ సమస్య రావడంతో గ్రామస్తులు అందరం కలిసి కీడు వంటలకు వచ్చాము అని గ్రామస్తులు తెలిపారు.