

జనం న్యూస్ మార్చి 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలం లోని పెద్దకోడపాక గ్రామంలోని శ్రీ వేద పాఠశాలలో గురువారం ముందస్తుగా హోళీ సంబరాలు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు విజయ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు జాజిరి ఆటలు ఆడి హోళీ సంబరాల్లో రంగురంగుల కలర్లు చల్లుకొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విజయ్ మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వేద, ప్రియాంక, కీర్తి రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు….