Listen to this article

రైతుల సహకారం మార్కెట్ కమిటీ అభివృద్ధి పాలకవర్గ ఉద్దేశం: చైర్మన్ మద్నూర్ మార్చ్ 13 జనం న్యూస్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లోనే పత్తి పంట కొనుగోళ్లలో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం గురువారం ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. రైతులకు సహకారం మార్కెట్ కమిటీ అభివృద్ధి పరచడమే పాలకవర్గ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మద్నూర్ మార్కెట్ కమిటీ ఆదాయం గురించి చర్చించినట్టు తెలిసింది. ఈ సాధారణ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ పాలకవర్గం సభ్యులు ఇన్చార్జి సెక్రెటరీ శ్రీకాంత్ ఏఎంసి కార్యాలయ సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు.