

డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ.. జనం న్యూస్ // మార్చ్ // 13 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జగ్గయ్య పల్లి గ్రామంలో గురువారం జరుగుతున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య మహిళ శిబిరానికి వచ్చిన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రతి మంగళవారం,గురువారం ఆరోగ్య మహిళా శిబిరం నిర్వహిస్తారని వైద్యురాలు సూచన మేరకు వైద్య పరీక్షలు చేసుకోవాలని సుమారు 56 రకాల వైద్య పరీక్షలు చేస్తారని ప్రతి మహిళ కనీసం మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేసుకోవాలని అన్నారు. కుటుంబం గురించి ఆలోచించే మహిళలు ముందుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఒకవేళ అనారోగ్యం బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి నష్టపోకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ముఖ్యంగా వడదెబ్బ మీద( డ్రై, డే ) మీద టిబి నిక్షయ్ శివిర్ 100 రోజుల ప్రణాళికలో భాగంగా టిబి మీద అవగాహన కల్పించారు. ప్రతి మహిళ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ సంధ్యారాణి, హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్,ఏ మోహన్ రెడ్డి సూపర్వైజర్స్ కుసుమ కుమారి ఆరోగ్యశాఖ సిబ్బంది శ్యామల,రామకృష్ణ మరియు ఆశలు తదితరులు పాల్గొన్నారు.
