Listen to this article

మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్ జనం న్యూస్,మార్చ్ 13,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక ఎంపీపీఎస్, ఎంపిహెచ్ఎస్ ఉమీ, పాఠశాలలను గురువారం మండల విద్యాఆధికారి ఎండి రహీమొద్దీన్, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా పాఠశాల ఆవరణంలోని పరిసరాలను,పాఠశాల అధ్యాపకులను, పాఠశాల రికార్డు రిజిస్టర్ లను,విద్యార్థుల హాజరు పట్టిక రిజిస్టర్ లను, మధ్యాహ్న భోజన రిజిస్టర్ లను,క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు, పాఠాలను బోధించే ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల, బోధనలను తరగతి గదులలో పరిశీలించారు. అనంతరం విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలోని పరిసరాలను తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.మధ్యాహ్న భోజన పథకం ప్రతినిత్యం మెన్యూ ప్రకారం అందించాలని అన్నారు. ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాఠశాల సమయానికి హాజరుకావాలని అన్నారు భోజనాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానఉపాధ్యాయులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.