Listen to this article

జనం న్యూస్ మార్చ్ 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంఫైజాబాద్ గ్రామంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రాత్రి సమయంలో కామ దహనం హోలీ పండుగ సందర్భంగా ఫైజాబాద్ గ్రామంలో కాముని దహనం ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగ అనగానే గుర్తుకు వచ్చేది కామ దహనం. దీనినే కాముని పున్నమి అని కూడా అంటారు. కాముని బొమ్మను పూర్ణిమి రాత్రి దహనం చేస్తారు. కామూడు అంటే మన్మధుడు . అతన్ని దహించి వేయడం ఈ కథలోని ఇతివృత్తాంతం. ఇది అనేక పురాణాలలో ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు తెలియజేశారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి గోపెడుతూ తయారుచేసిన పిడకలు మరియు ధాన్యపు గింజలు సేకరిస్తూ . సేకరించిన గింజలు పిడకాలను గ్రామం నడివొడ్డిన బొడ్రాయి వద్ద కాలుస్తారు. కాముని బొమ్మలు పిడకలు కర్రలు ఒకే స్థానంలో వేసి వెలిగిస్తారు. దీనినే కాముని దాహం అంటారు. కాముని దహనంలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన విత్తనాలను కుమ్మరి వారి కుండలో ఉడికిస్తారు. కామునిదహన సమయంలో కాముని చుట్టూ తిరుగుతూ స్త్రీలు నీటి సాగాల పెడతారు. కాముని పై పాటలు పాడుతారు. ఉడికించిన విత్తనాలను ప్రతి ఇంటికి మహా ప్రసాదంగా వితరణ చేశారు. కాముడీ దహనం చేయగా వచ్చిన బూడిదిని విభూతిగా చిన్నలు పెద్దలు శిరస్సున అలంకరిస్తారు. ఈ బూడిద శ్రేయస్కారమని భూతప్రేతాల నుండి మనల రక్షించబడుతుందని పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు