

మద్దూర్ మార్చి 13 4:- జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో సల్బత్పూర్ చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ విజయ్ కొండ ఎస్పీ ఆదేశానుసారంగా వాహనాల ముమ్మరంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు లైసెన్సులను ఇన్సూరెన్స్ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాల ధ్రువీకరణ పత్రాలు లేనిచో వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ పరమేష్. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

