Listen to this article

జనం న్యూస్ 14 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ విజయనగర కేంద్రంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు మయూరి కూడలి నుంచి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూడి రామ్మోహన్ గారు మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాలు కలిపి విద్యార్థులకు దాదాపు 3680 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టిందని తక్షణమే ఆ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో విద్యార్థుల ఆందోళన ఫలితంగా దశలవారీగా విడుదల చేస్తామన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికీ విడుదల చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. జీవో నెంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలని, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దుచేసి యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయని యెడల విద్యార్థులు అందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామని, గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పామో అదేవిధంగా పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము సిహెచ్ వెంకటేశ్ లు మాట్లాడుతూ ఉపకార వేతనాలు విడుదల కాక జిల్లాలో డిగ్రీ కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలలో హాల్ టికెట్స్ ఇచ్చే పరిస్థితి లేదని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు. గతంలో డిగ్రీ రిలీవ్ అయిన విద్యార్థులు వేల సంఖ్యలో పీజీ జాయిన్ అయ్యేవారు అని జీవో నెంబర్ 77 మూలంగా ఉపకార వేతనాలు రాక అనేకమంది విద్యార్థులు డిగ్రీ తర్వాత చదువు ఆపేస్తున్నారని కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 77 రద్దుచేసి స్కాలర్షిప్ అందించాలని కోరారు. గత రెండు నెలలుగా నిరసన దీక్షలు చేస్తున్న వెటర్నరీ విద్యార్థులకు స్టై ఫండ్ 25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ అన్ని డిమాండ్ల సాధనకై ఈనెల 15వ తారీఖున విజయవాడలో జరగబోవు రాష్ట్రవ్యాప్త విద్యార్థి నిరసన దీక్షను జయప్రదం చేయాలని కోరారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ దీక్షలో పాల్గొంటారని ఈ నిరసన దీక్ష కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలు పరిష్కారం కోసం హెచ్చరిక జారీ చేస్తామని సమస్యలు పరిష్కరించిన యెడల ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జ్.రవికుమార్, కే. జగదీష్, పి రమేష్ జిల్లా సహాయ కార్యదర్శి శిరీష , కే రాజు జిల్లా కమిటీ సభ్యులు సూరిబాబు, జయ మరియు నాయకులు గుణ ,మురళీ తదితరులు పాల్గొన్నారు.