

జనం న్యూస్ 14 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆత్మహత్యాయత్నంకు పాల్పడతానని సూసైడ్ నోట్ వ్రాసిన కేరళ యువకుడు విష్ణు కొయిత్తా పత్తాయా వెస్లీ (21సం.లు) ఆచూకీని మార్చి 11న రాత్రి 9గంటల సమయంలో విజయనగరం పట్టణంలో గుర్తించి, యువకుడికి కౌన్సిలింగు నిర్వహించి, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు సమక్షంలో వారి బంధువులకు అప్పగించనున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మార్చి 13న తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లాకు చెందిన చెందిన యువకుడు విష్ణు కొయిత్తా పత్తాయా వెట్లీ (21నం.లు) బిఎస్సీ నర్సింగు చదువుకొని, కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఒక యువతితో పరిచయం ఏర్పడి, ఆమెను గాఢంగా ప్రేమించాడన్నారు. కాలక్రమంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తడంతో, యువకుడి ఫోను నంబరును సదరు యువతి బ్లాక్ చేయడంతో, మనస్తాపం చెందారన్నారు. ఈ ఘటన నుండి సదరు యువకుడు బయటపడలేక
ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, తన డెడ్ బాడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో ట్రేస్ చేసుకోవచ్చుని సూసైడ్ లెటరు వ్రాసి, సోషల్ మీడియాలో పోస్టు చేసాడన్నారు. ఈ పోస్టుతో అప్రమత్తమైన సదరు యువకుని బంధువులు, స్నేహితులు సదరు విషయాన్ని జిల్లా ఎస్పీ వకల్ జిందల్ దృష్టికి ఫోను ద్వారా తీసుకొని రాగా, యువకుడి ఆచూకీ కనిపెట్టి, రక్షించే చర్యలు చేపట్టాలని వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. యువకుడి ఆచూకీ కనిపెట్టేందుకు రంగంలో దిగిన వన్ టౌన్ పోలీసులు సాంకేతికతను వినియోగించి విశాఖ ట్నం, చీపురుపల్లి, విజయనగరం పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో గాలించి, చివరికి యువకుడి ఆచూకీని విజయనగరంరైల్వే స్టేషనులో మార్చి 11న రాత్రి కనుగొన్నారన్నారు. యువకుడ్ని విజయనగరం 1వ పట్టణంకు తీసుకొని వచ్చి, కౌన్సిలింగు నిర్వహించి, వారి బంధువులకు సమాచారం అందించనున్నారన్నారు. యువకుడి బంధువులు మార్చి 13న జిల్లా కేంద్రంకు చేరుకోగా, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు సమక్షంలో అప్పగించారన్నారు. జీవితం చాలా
విలువైనదని, జీవితంలో ఏర్పడిన స్వల్ప వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు సరికాదని, ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకొని, లక్ష్య సాధనకు కృషి చేయాలని పోలీసులు యువకుడు విష్ణు కే.పి.కి హితభోద చేసారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సకాలంలో స్పందించి, యువకుడి ఆచూకీ కనిపెట్టి, ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ మరియు సిబ్బందిని డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. యువకుడ్ని కాపాడుటలో చొరవచూపి, సమయానుకూలంగా అధికారులకు, సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కు యువకుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.