Listen to this article

జనం న్యూస్ 14 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కానిస్టేబుల్ అభ్యర్థులకు కోర్టులో ఉన్న హోంగార్డు రిజర్వేషన్ కేసును పరిష్కరించి మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని కోట జంక్షన్ వద్ద భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంలో డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ CH .హరీష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 20 22 నవంబర్ 28న 6100 పోస్టలు బర్తీ చేశారు2023 జనవరి 22న ఫ్రీలిమ్స్ పరీక్షకు 4 , 59 ,182. మంది హాజరయ్యారు ప్రిలిమ్స్ పరీక్షలలో 95 208 మంది అర్హత సాధించారని ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు కోర్టు కేసులు 2024 డేసింబర్ 22 నుండి జనవరి 16 వరకు ఈవెంట్స్ జరిగాయి. మూడు నెలలు అవుతున్న సరే ఇంతవరకు హోంగార్డు కోర్టు కేసు ఉందని దపత ధపాలుగా కేసుని వాయిదా వేసి నిరుద్యోగులకు ఆశలు చిగురిల్లలా చేస్తుంది… ఎన్డీఏ కూటమి వొచ్చిన తర్వాత తొమ్మిది మాసాలు అవుతున్నా!సరే నిరుద్యోగుల గురించి ఎక్కడ కూడా మాటలాడ లేని పరిస్థితి . విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు,గ హోం మంత్రి అనితా గారు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో భాగంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ ని ఆరు మాసాల్లో భర్తీ చేసి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు ..ఇంతవరకు కూడా దీని గురించి అధికారులు మాట్లాడనీ పరిస్థితి . జిల్లాలో ఉన్న నిరుద్యోగ అందరు కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబ నుంచి వచ్చి నగర పట్టణంలోని ఉన్న రీడింగ్ హాల్లో ,కోచింగ్ సెంటర్ లో ఫీజులు కట్టుకోలేక, కోట వద్ద, లైబ్రరీలోని రాత్రింబవళ్లు ఉద్యోగం కోసం నిరంతరం చదువుతూనే ఉన్నారు… మరో ఉద్యోగం కోసం వెళ్ళ లేని పరిస్థితి . నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు ప్రభుత్వం వెంటనే కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం చేసి ఒక న్యాయం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో నాగరాజు, వినోదు, శంకర,, రాము, భాను ప్రసాద, 50 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు పాల్గొన్నారు….