

బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ను. జనం న్యూస్ 14 మార్చి 2025 గులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల జిల్లా కేంద్రం లోని తన నివాసం లో హౌస్ అరెస్ట్ చేసిన ఐజ మండలం పోలీసులు. అరెస్టు చేసి ఐజ మండలం తరలిస్తున్నారు.మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం సందర్భంగా అరెస్టులు చేయడం దుర్మార్గం.ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ…ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి నిర్బంధించడం చేతకానితనం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు..మా హక్కును కాల రాస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.అరెస్టులతో నిర్బంధాలతో ప్రజాపాలన చేయలేరు రేవంత్ రెడ్డి.మీరు ప్రజా పాలన గాలికి వదిలేసి ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయకుండా… నిర్బంధాలతో అరెస్టుతో మా గొంతులను నొక్కలేరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే పాలన చేయండి.. మీరిచ్చిన 6 గ్యారంటీలను 420 హామీలను అమలు చేయండి. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారిని అసెంబ్లీ నుండి సెషన్ ఈ వరకు సస్పెండ్ చేయడం మీ చేతకానికి నిదర్శనం. రైతు రుణమాఫీ చేయలేదు భరోసా ఇవ్వలేదు భువనస్ ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వలేదు పింఛన్ ఇవ్వలేదు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు జాబులు ఇవ్వలేదు మహిళలకు 2500 ఇవ్వలేదు స్కూటీలు ఇవ్వలేదు.