

జనం న్యూస్ మార్చి 14 తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ కేరింతలు, ఆనందోత్సవాల మధ్య శుక్రవారం ప్రజలు హోలీ పండుగను జరుపుకొన్నారు. పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు, యవతీయువకులు, పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. పలుచోట్ల హోలీ సందర్భంగా కామదహనం నిర్వహించారు. చిన్నాపెద్దా కలిసి ఆడిపాడుతూ.. రంగులు పూసుకుంటూ సందడి చేశారు. .సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం గ్రామంలో మాజీ ఎంపిటిసి అంతిరెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామమంతా ఎక్కడా చూసిన రంగులే కనిపించాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రంగులు పూసుకుంటూ ఏంతో ఆనందంగా పండుగను జరుపుకున్నారు.ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం జీవితాల్లో సంతోషాన్ని నింపడం కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్ లతో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని కెమికల్ రంగులతో ఆడకుండా సేంద్రీయ రంగులతో హోలీని జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ప్రశాంతంగా హోలిని జరుపుకోవాలని ఆయన అన్నారు .గత మూడు సంవత్సరాల నుండి రామేశ్వరం బండ గ్రామంలో చిన్నలు పెద్దలు యువతీ, యువకులు ఆటపాటలతో రంగుల హరివిల్లులో స్నేహితులతో, కుటుంబాలతో కలిసి ఒకరికొకరు రంగులు పూసుకుని సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేసుకుంటూ ఈ పండుగను ఘనంగాజరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.