Listen to this article

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి ) ఫాల్గుణ మాసం పౌర్ణమి శుక్రవారం మహపర్వదినం పురస్కరించుకుని మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం లో చండీహోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ,మండపారాదన అనంతరం చండిహోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెలా పౌర్ణమి తిధికి భక్తుల గోత్రనామాలతో దేవస్థానం తరపున చండి హోమం నిర్వహింస్తారు. 91 మంది భక్తులు చండి హోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లు ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. కార్యక్రమంలో శ్రీ ఆకొండి కిరణ్,తదితరులు పాల్గొన్నారు