

జనం న్యూస్ మార్చి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో పది లక్షల మంది మున్నూరు కాపులతో జరగబోయే సమావేశం జయప్రదం చేయడానికి శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కూకట్ పల్లి వివేకానంద నగర్ డివిజన్ లో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం లో తెల్ల హరికృష్ణ పటేల్, నిరంజన్ పటేల్ ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేములవాడ మున్నూరు కాపు నిత్యానదాన సత్రం ఉపాధ్యక్షులు చింతపంంటి భూమయ్య పటేల్ మూసాపేట్ మాజీ సర్పంచ్ తూము శ్రీనివాస్ పటేల్ గ ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణంలో వివేకానంద నగర్ డివిజన్ బాగ్ అమీర్ కూకట్ పల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అల్లం మహేష్ కుమార్ పటేల్, కార్యదర్శి ఆకుల బాలకృష్ణ పటేల్ కోశాధికారి మన్నె కమలాకర్ పటేల్ తో కలిసి కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ పటేల్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం కూకట్ పల్లీ సర్కిల్ లో ఉన్న 12 డివిజన్ లో హైదర్ నగర్ నుండి బోయిన్పల్లి వరకు ఉన్న మున్నూరు కాపులందరినీ కలిసి రేపు పెరేడ్ గ్రౌండ్ మైదానంలో జరగబోయే సమావేశాన్ని జయప్రదం చేయడానికి కార్యాచరణలను రూపొందించు కోవడానికి సమావేశాలను ఏర్పరుస్తున్నారని తెలియజేశారు కావున ఈ పన్నెండు డివిజన్ లో ఉన్న మన మున్నూరు కాపులు అందరూ సహకరించాలని కోరడం జరిగింది, ఈ సందర్భంగా పెద్దలు చింతపంంటి భూమయ్య పటేల్ తూము శ్రీనివాసరావు పటేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్నూరు కాపు సంఘాల నాయకులను కలుపుకొని సలహాలు సూచనలను తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.