Listen to this article

జనం న్యూస్ మార్చి 14: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలోమాజీ మంత్రిబాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకల ను శుక్రవారం రోజునా ఏర్గట్లమండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల నుజరుపుకొని ,స్వీట్లు పంచుకోవడం జరిగింది.మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజాపూర్ణనందం మాట్లాడు తూప్రశాంత్ రెడ్డిబాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైనపాత్ర వహించి అన్ని గ్రామాలకు సమాన రీతిలో అభివృద్ధి నిధులనుపంచారని బాల్కొండ నియోజకవర్గ ప్రజలఆశీర్వాదాలు ఎల్లవేళలా ప్రశాంత్ రెడ్డికి ఉంటాయని అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ఎల్లవేళలా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాల నికోరుకోవడం జరిగింది అని మాట్లాడారు . ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.