


బిచ్కుంద మార్చి 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ పటేల్ ఆధ్వర్యంలో హోలీ పండుగ ఘనంగా నిర్వహించి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రకాష్ మాట్లాడుతూ .ఈ రంగుల పండుగ హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లాయర్ లక్ష్మణరావు, మల్లేశం విట్టల్ రావు , విట్టల్ , శివాజీ ,శంకర్ పటేల్ ,పురుషోత్తం, రాజు దేశాయ తదితరులు పాల్గొన్నారు