

జనం న్యూస్ మార్చి(14) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు మరియు గ్రామాలలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. కులమతలకు అతీతంగా అందరూ కలిసి హోలి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని యువకులు తెలియజేశారు. వివిధ రకాల రంగులు ఒకరిపై ఒకరు చల్లుకొని గ్రామంలో తిరుగుతూ సంబరాలు నిర్వహించుకున్నారు.