Listen to this article

జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండలం లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర.సత్యనారాయణ రావు అనంతరం ఆయన మాట్లాడుతూ
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద క్రీ. శే. బాసాని కైలాసం – కనకలక్ష్మీ బాసాని రమాదేవి స్మారకార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై చలి వేంద్రాన్ని ప్రారంభించారు. ప్రధాన కూడళ్లలో వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అని ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా, మరికొంత మంది, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సైతం ముందుకువచ్చి ఈ వేసవిలో చలివేంద్రాలని ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొప్పుల గ్రామంలో పెద్దమ్మతల్లిని దర్శించుకుని శాయంపేట లో చలివేంద్రం ప్రారంభోత్సవం చేసి అనంతరం కొప్పుల గ్రామానికి బయలుదేరారు. అనంతరం ఆ గ్రామంలోని పెద్దమ్మ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కొప్పుల గ్రామ అభివృద్ధికి తన వంతుగా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ శాయంపేట పద్మశాలి కమిటీ అధ్యక్షులు సామల మధుసూదన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబాసి కృష్ణమూర్తి నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…..