

జనం న్యూస్ మార్చి 14(నడిగూడెం) హోలీ పండుగ సందర్భంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రజలు హోలీ సంబరాలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన హోలీ వేడుకల్లో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ గ్రామస్తులతో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. హోలీ వేడుకల్లో యువతీ యువకులు, చిన్నారులు, పెద్దలు సాంప్రదాయ బద్ధంగా రంగులు చల్లుకొని, ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
