

గాందోళి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి విక్రమార్కుడు గొప్ప సాంఘిక నాటకం నిర్వహణ సహకరించిన తలకు ప్రత్యేక కృతజ్ఞతలు దేవాలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య యాదవ్
జనం న్యూస్ మార్చి 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 17 న గాందోళి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య తెలిపారు.గాందోళి ఉత్సవ నిర్వహణ దాతలుగా మునగాల మాజీ ఎంపీపీ యలక బిందు నరేందర్ రెడ్డి, కుంచం నరసయ్య ఇందిరమ్మ, పంచాయతీ కార్యదర్శి సారిక నాగరాజు శ్రావణి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గాందోళి ఉత్సవం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమానికి దాతలుగా బత్తుల ఉష శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ, మొగిలిచర్ల వెంకటేష్, సారిక నాగరాజు, రావులపెంట సైదులు, చిట్యాల నరేందర్ రెడ్డి, రావుల ప్రసాద్, గండు సుందరయ్య, పింగిలి మహేశ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గాందోళి ఉత్సవ సందర్భంగా రాత్రి విక్రమార్కుడు గొప్ప సాంఘిక నాటకం నిర్వహణ సారిక రామయ్య యాదవ్ నాగలక్ష్మి దేవస్థానం చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ గాందోళి ఉత్సవాన్ని కి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గాందోళి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. గాందోళి ఉత్సవానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.