Listen to this article

బుర్రి శ్రీరాములు.. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జనం న్యూస్ మార్చి 15 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలి.అని సీపీఐ(ఎం)పార్టీ మునగాల మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం మునగాల మండల పరిధిలో కలకోవ గ్రామంలో ప్రజా సమస్యలపై సిపిఎం ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు,వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వాగ్దానాలను అమలు చేయాలని,అర్హులైన పేదలకీ ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ తో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని, గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు,వితంతువు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు మంజూరు చేయాలని. కేరళ తరహాలో 18 రకాలు నిత్యవసర సరుకులు ప్రజా పంపిణీ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండలంలోని వివిధ గ్రామాలలో ఎండి పోయిన వరి పంట పొలాలకు ప్రభుత్వం నష్ట పరిహారం రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మునగాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరినారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల వ్యాప్తంగా అన్ని గ్రా మాలలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. లేనియెడల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు మండవ వెంకటాద్రి, వెంకట కోటమ్మ, గ్రామ శాఖ కార్యదర్శి జ్యోతి బాబు, పలువురు రైతులు,నాయకులు పాల్గొన్నారు.