

జనం న్యూస్ 13 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం తెలుగు ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే సంక్రాంతి పండగ ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండగ భోగ భాగ్యాలు కలిగించాలని, అందరి ఇళ్ళల్లో సంక్రాంతి శోభ సంతరించాలని, మూడు రోజుల పండగ సందడితో ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని కోరారు.