

కంభం పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియజేసిన మార్కాపురం డి.ఎస్.పి కంభం సీఐ. జనం-న్యూస్, మార్చి 14,(ఏపీ స్టేట్ బ్యూరో చీప్):- ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలో మంగళవారం మంద హుస్సైనమ్మ, కూతురుతో కలిసి పట్టణంలోని చర్చికి వెళ్లి వస్తుండగా చైన్ స్నాకర్స్ మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించడం జరిగింది. వెంటనే అక్కడ స్థానికులు స్పందించిన దొంగలు చాకచక్యంగా తప్పించుకొని పారిపోయారు. తక్షణమే మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించిన కంభం ఎస్సై బి. నరసింహారావు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. అనంతరము ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయడం జరిగింది. మార్కాపురం డిఎస్పి ఆదేశాల మేరకు కంభం సీఐ సూచనల అనుగుణంగా కంభం ఎస్సై బి. నరసింహారావు ప్రత్యేక బృందంతో ముమ్మరంగా దర్యాప్తు చేసి చాకచక్యంగా రెండు రోజుల వ్యవధిలో ముద్దాయిలను రాగిపాడు రోడ్డులో అరెస్టు చేయడం జరిగింది. ముద్దాయి షేక్ సలీం ముండ్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అతని నుంచి తాళిబొట్టు సరుడు 30 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 2,400,00 రూపాయలని అంచనా వేశారు. అనంతరము ముద్దాయిని కోర్టులో హాజరపరచడం జరిగింది. కేసును అతి తక్కువ సమయంలో మార్కాపురం డి.ఎస్.పి ఆధ్వర్యంలో కంబం సీఐ సూచనల మేరకు ఛేదించిన కంభం ఎస్ఐ బి. నరసింహారావును వారి సిబ్బంది ఎస్ కే.బషీర్, కే. రమేష్, డి. మహబూబ్ సుభాని, సిహెచ్ పేరయ్య, బి. శివ, హోంగార్డు ఖాదర్ ను ప్రకాశం జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు.