Listen to this article

జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు విజయ సునీత శుక్రవారం విజయనగరం పట్టణంలోని మూడు రైతు బజార్లు, మార్కెట్‌ కమిటీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెటింగ్‌ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి, మార్కెట్లలో వ్యవస్థాపిత సదుపాయాలను పరిశీలించారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, కూరగాయల ధరలు, మార్కెట్‌ కమిటీల విధానం గురించి అధికారులతో చర్చించారు.