

జనం న్యూస్ 15 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య,,ఈరోజు అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని సంకాపురం గ్రామంలో కుర్వ పాలతి ఈశ్వరన్న కుమార్తె నీలవేణి జంతు శాస్త్రం (zoology) లో జూనియర్ కాలేజీ లెక్చరర్ గా ఉద్యోగం సాధించిన* శుభ సందర్భంగా గ్రామంలోని వారి నివాసం లో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక మారుమూల గ్రామంలో మెరిసిన ఆణిముత్యం. కుమార్తెను ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించేవరకు చదివించిన తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ విద్యా భవిష్యత్తుకి పునాది లాంటిది అటువంటి విద్యార్థులను తీర్చిదిద్ది దేశానికి అందించాలని లెక్చరర్ నీలవేణికి సూచించారు.ఈ కార్యక్రమంలో సంకపురం కుమ్మరి జయన్న, నరసింహాచారి, వీరేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.