

హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు జనం న్యూస్,మార్చి15, అచ్యుతాపురం: ఈరోజు (ఉమ్మడి) విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరీయన్స్ ఫెడరేషన్ (ఏపీవిఎన్జివిఎఫ్) సర్వసభ్య సమావేశం హనుమంతవాక పాత డైరీ ఫారం ఆవరణలో ఉన్న ఏపీవిఎన్జివిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరీయన్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ బి. సేవా నాయక్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి గోవిందరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న (వెటర్నరీ అసిస్టెంట్స్, లైవ్ స్టాక్ అసిస్టెంట్స్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ మరియు వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ మూడు సంఘాల సర్వ సభ్యులు కార్యవర్గ కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది . ఈ సమావేశంలో విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్స్ మరియు వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరియు (ఉమ్మడి) విశాఖపట్నం జిల్లా చైర్మన్ గా దోని కోదండరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దోని కోదండరావు తిమ్మరాజుపేట గ్రామీణ పశు వైద్య కేంద్రంలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ఏపీఎన్జీవిఎఫ్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోదండరావును రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ బి. సేవా నాయక్, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనం గోవిందరాజు, ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ విజయ సారధి, ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టేటస్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాఘవ , విశాఖపట్నం జిల్లా లైవ్ స్టాక్ అసిస్టెంట్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి. అప్పల నాయుడు, ఏఎస్ఆర్ జిల్లా ఇంచార్జ్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ , శ్రీకాకుళం జిల్లా ఫెడరేషన్ చైర్మన్ డి. రఘు, విజయనగరం జిల్లా చైర్మన్ సి.హెచ్. తారకేశ్వర రావు విశాఖపట్నం జిల్లా జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ మరియు వెటర్నరీ ఆఫీసర్స్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ సత్యం , మాజీ చైర్మన్ ఎస్ అప్పారావు, పి జనార్దన్ రావు అభినందించారు. మిగతా ఉద్యోగులు అందరూ కూడా కోదండరావు చైర్మన్ గా ఎన్నికైనందుకు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. తెలియజేశారు.