

విద్యార్థులు ఉన్నతమైన కలలు కని, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడి చదివితేనే ఉన్నతమై స్థానాలకు చేరుకుంటారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ జనం న్యూస్ మార్చి 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) విద్యార్థులు ఉన్నతమైన కలలు కని, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడి చదివితేనే ఉన్నతమై స్థానాలకు చేరుకుంటారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటారని, వారి ఆశయసాధన కోసం విద్యార్థులు కష్టపడాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పరీక్షలపై ఉన్న భయం, అపోహలను పోగొట్టేందుకు శనివారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్లో ఫైనల్ పరీక్షలకై సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించి మాట్లాడారు..మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

