

జగన్ న్యూస్ మార్చి 15 నడిగూడెం నడిగూడెం పోలీస్ స్టేషన్ ను ఇటీవల జిల్లాకు నూతన ఎస్పీగా వచ్చిన కే నరసింహ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ దస్త్రాలను, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.కేసుల పని మీద స్టేషన్ కు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అందుబాటులో ఉండి సేవలందించాలని సిబ్బందికి సూచించారు.వారితో వెంట మునగాల వలయాధికారి రామకృష్ణారెడ్డి, నడిగూడెం,మునగాలఎస్ఐ లు అజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, ఏఎస్ఐలు మన్సూర్, జగన్నాథం, హెడ్ కానిస్టేబుల్ లావణ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.