

స్వామి వివేకానంద జయంతిని నిర్వహించిన మండల విద్యాధికారి విట్టల్
జనం న్యూస్ జనవరి 13 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా
చిలిపిచేడు మండలం లోని యువతకు మండల విద్యాధికారి పి.విటల్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
మాట్లాడుతూ స్వామి వివేకానంద గారు గొప్ప ఆధ్యాత్మిక గురువు ఆలోచనపరుడు మరియు యువతకు ప్రేరణమూర్తి
యువతకు ఆయన జీవితం ఒక స్ఫూర్తి అని చెప్పడం జరిగింది భారతదేశానికి ఒక వరం లాంటి వాడని తెలియజేయడం జరిగింది
వివేకానంద గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ
ఇనుప కండరాలు ,ఉక్కునరాలు దృఢ సంకల్పం కలిగిన యువతతో దేశ యొక్క స్థితిగతులు మార్చేయొచ్చని తెలియజేయడం జరిగింది .కానీ
నేటి యువత సినిమాల,ఓటీడీల ప్రేరణతో గాడి తప్పుతుంది . మాదకద్రవ్యాల మత్తులో చిత్తవుతుంది .నేటి యువత ఇవన్నీ మానుకొని వివేకానంద గారిస్ఫూర్తితో జీవితంలో ఎదగాలని తెలియజేయడం జరిగింది .
అదేవిధంగా వివేకానంద గారికి మహిళలపై అమిత గౌరవం ఉండేది .
కానీ నేడు సమాజంలో మహిళలపై ద్వేషం అసూయ అసహనం ప్రబలుతున్నాయి . స్వామివివేకానంద గారు అనేవారు “స్త్రీలకు ఎలాంటి గౌరవం లభిస్తుందనేది ఒక దేశ అభివృద్ధికి కొలమానమని “వివేకానంద గారు ఉద్ఘటించారు .
‘అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు ఎంతో ధైర్యం కూడా ఉండాలని వివేకానంద గారు తెలియజేయడం జరిగింది .
విద్యార్థులు “మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని కచ్చితంగా సాధించగలరు ”
వివేకానంద గారి జీవితాన్ని స్ఫూర్తి తీసుకొని నేటి యువత మరియువిద్యార్థులు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి ,తమ లక్ష్య సాధన కోసం కృషి చేయాలి అని తెలియజేయడం జరిగింది .అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు వివరించడం జరిగింది