

జనం న్యూస్// మార్చ్ // 16// జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట రైల్వే స్టేషన్లో దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాస్తు జారిపడి కె.కొమురయ్య అనే రైల్వే ఉద్యోగి శనివారం మృతి చెందారు. మృతుడి స్వగ్రామం హనుమకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం, సోమీడి గ్రామం, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ఇంజనీర్ గా పనిచేస్తున్నారని, తోటి ఎంప్లాయిస్ తెలిపారు. విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో, జమ్మికుంట లో రైలు ఎక్కేందుకు, దానాపూర్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో రైలు ఎక్కే క్రమంలో కాలుజారి ప్లాట్ఫామ్ పై, పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వయసు( 50 ) సంవత్సరాలు ఉంటుందని, స్థానికులు తెలిపారు. కొమురయ్య కీ ముగ్గురు ఆడపిల్లలు , ఉన్నారు. ఈ మేరకు కాజీపేట రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.