

జనం న్యూస్ 17 మర్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం బతికపెల్లి గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్వర్ పాషా, జాకిర్ పాషా మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మృతుల కుటుంబాలకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.