Listen to this article

జనం న్యూస్ జనవరి 13/2025/కల్వకుర్తి ఇంచార్జ్ :- వెల్దండ మండల కేంద్రంలో ఈనెల 15న వెల్దండ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్మీ డే వేడుకలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని మాజీ సైనికులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా. వెల్దండలో ఎమ్మెల్యేను కలిసి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో పీసీబీ మెంబర్ బాలాజీ సింగ్, మట్ట వెంకటయ్య గౌడ్, సంజీవ్ కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, రామకృష్ణ, మల్లేష్ గౌడ్, సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మట్ట చంద్రశేఖర్ గౌడ్, పురుషోత్తంచారి, శ్రీను తదితరులు ఉన్నారు.