Listen to this article

డాక్టర్ మన్వితను సత్కరిస్తున్న ఆర్య వైశ్య సంఘం ప్రముఖులు
జనం న్యూస్ మార్చ్ 17 అమలాపురం మామిడికుదురు: వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయే షన్ పూర్తి చేసి పట్టా పొందిన పాశర్లపూడిలంకకు చెందిన డాక్టర్ పెదమల్లు మన్వితను ఆదివారం గ్రామంలో ఘనంగా సత్కరించారు. స్వగ్రామం లో పెదమల్లు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబి సమావేశంలో మాట్లాడుతూ మారు మూల గ్రామంలో పుట్టి, 13 ఏళ్లు ఎంతో కష్టపడి చదువుకుని ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ చదివి అనంతరం పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిలాషిం చారు. మన్వితతో పాటు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, దేవి దంపతులను ఘనంగా సత్కరిం చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలు యెండూరి సీత, కంచర్ల కృష్ణ మోహన్, పోశెట్టి సూరిబాబు, కాసు శ్రీను, లక్కింశెట్టి బాబులు, ఏడిద కవీంద్ర తదితరులు పాల్గొన్నారు.