Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గంజాయి విక్రయాలు చేపట్టినా, అక్రమ రవాణకు పాల్పడినా, వినియోగించినా తీవ్రమైన నేరంగా పరిగణించి, చట్ట పరిధిలో కఠిన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మార్చి 16న తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఒకవైపు కఠినమైన చర్యలు చేపడుతూ, మరోవైపు విద్యార్థులు, యువత, ప్రజలను మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పప్రభావాలను వివరించేంందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మాదక ద్రవ్యాలకు
అలవాటు పడిన యువతలో మార్పు తీసుకొని వచ్చి, వారిని తిరిగి సన్మార్గంలో నడపాలనే ఉద్ధేశ్యంతో, మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పప్రభావాలను యువతకు వివరించి, అవగాహన కల్పించి, చైతన్యం తీసుకొని వచ్చి, వారిని మాదక ద్రవ్యాల అలవాటుకు దూరం చేసి, తిరిగి సన్మార్గంలో నడిపించేందుకు “సంకల్పం” కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మన్నారు. మరోవైపు గంజాయి విక్రయాలు, అక్రమ రవాణ, వినియోగాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
2024సం.లో గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్న వారిపై 62 కేసులు నమోదు చేసి, 1656.990 కిలోల గంజాయి, 70 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకొని, 218మందిని అరెస్టు చేసామన్నారు. అదే విధంగా 2025సం.లో ఇప్పటి వరకు 24కేసులు నమోదు చేసి, 265.626కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 65 మందిని అరెస్టు చేసామన్నారు. గంజాయి అక్రమ రవాణకు గ్రూపులుగా ఏర్పడి, వ్యాపారాలు సాగిస్తున్న 54మందిని గుర్తించి, గంజాయి కేసుల్లో నిందితులుగా చేర్చామన్నారు. వారిలో 43మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారన్నారు. గంజాయి కేసుల్లో లింకులను చేధిస్తున్నామని, అక్రమ రవాణకు బాధ్యులైన ప్రధాన నిందితులను అరెస్టు చేస్తున్నామన్నారు. గంజాయి వ్యాపారాలతో ఆస్తులు కూడబెట్టే వారిని గుర్తించి, వారి ఆస్తులను అటాచ్ చేస్తున్నామన్నారు. ఈ తరహా నేరాలకు తరుచూ పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరిచి, వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేసామన్నారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు జిల్లాలో ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టామన్నారు. అదే విధంగా ప్రతీ రోజూ పది ప్రాంతాల్లో డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా, వారిపై పి.డి.యాక్టు ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని గంజాయి వ్యాపారాలకు పాల్పడే వారిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు.