

జనం న్యూస్ 13.1.2025
మెదక్ జిల్లా చేగుంట మండల ఓబీసీ మండల పార్టీ అధ్యక్షుడు అన్నం ఆంజనేయులు
మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం
– అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు
– జనవరి 26 నుంచి పేదోడు మెచ్చే నాలుగు హామీలు అమలు కాబోతున్నాయి
– ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుంది
– ఎవరో రెచ్చగొట్టే మాటలు విని అభద్రతకు లోను కావొద్దు
పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం అని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని
ఓబీసీ మండల పార్టీ అధ్యక్షుడు అన్నం ఆంజనేయులు
మాట్లాడుతూ…. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం పూర్తి అయిందని పేర్కొన్నారు.
ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు, గ్రామ పెద్దలు నిర్ణయం మేరకే అర్హులను గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాని వారు ఎవరో రెచ్చగొట్టే మాటలు విని అభద్రతకు లోను కావొద్దని పేదలకు సూచించారు.
మరో పదిహేను రోజుల్లో అంటే
ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఇచ్చిన మాట ప్రకారం మరో నాలుగు హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. భూమి లేని రైతు కూలీలకు రెండు విడతలుగా ఏడాదికి రూ. 12వేలు ఇచ్చే కార్యక్రమం, భూమి ఉండి సాగు చేసుకునే ప్రతి రైతుకు ఎకరాకు ఏడాదికి రూ. 12 వేలు, అర్హులైన ప్రతి పేదవాడి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో పాటు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5లక్షలు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు.
రాబోవు రోజుల్లో కూడా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం చేకూరే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని