

జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం.
కొత్తపల్లి: చాకచక్యంతో ఓ లైన్మన్ తృటిలో విద్యుత్ ప్రమాదం నుంచి త ప్పించుకున్న సంఘటన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఆది వారం చోటు చేసుకొంది. వివరాల్లోకి వె ళితే. కొత్తపల్లి గ్రామానికి చెందిన. మోహీన్.లోకుర్తి.సబ్స్టేషన్లో లైన్మ న్గా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకొని స్వంత గ్రామమైన కొత్తపల్లికి వచ్చాడు. తన ఇంట్లో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో దీనిని సరి చేయడానికి స్థానిక. సబ్స్టేషన్లో ఎ ఎల్సీని తీసుకున్నారు. అలాగే అంత కు ముందు అదే లైన్కు మరోచోట ఏర్పడ్డ అంతరాయాన్ని సరిచేసేందుకు ఇంకో లైన్మన్ కూడా ఎల్సీని తీసుకున్నారు. పని ముగించుకొని మొదటి లైన్ మన్ ఎల్సీని వాపసు ఇవ్వగా ఆపరేటర్ అదే లైన్లో ఇచ్చిన మరో ఎల్సీ విషయం మరిచి గమనించకుండా విద్యుత్ సరఫరాను ఆన్ చేశాడు. ఈ క్రమంలో స్తంభం ఎక్కి మరమ్మతు చేస్తున్న మోహీన్ విద్యుత్ షాక్ తగల డాన్ని గమనించి వెంటనే అప్రమత్తమై చాకచక్యంతో స్తంభానికి రెండు కాళ్లు బిగించి పట్టుకొని కిందికి వేళాడుతూ.త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తపించుకున్నాడు. మోహీన్ ను చూసి గ్రామస్థులు ఒకింత భయానికి గుర య్యారు. ఆప్డేటర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు తెలిపారు. అతన్ని చికిత్స కోసం మహబూబ్నగర్. ఎస్ వి ఎస్. ఆసుపత్రికి తరలించారు.