Listen to this article

మద్నూర్ మార్చ్ 17 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సార్ సందర్శించారు. సోమవారం ఆయన పోలీస్ స్టేషన్ ను సందర్శించి కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందించారు. జిల్లాకు సరిహద్దున మహారాష్ట్ర పక్కనే మద్నూర్ మండలం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి.. మహారాష్ట్ర… తెలంగాణ సరిహద్దు ప్రాంత పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణ, బిచ్కుంద సీఐ నరేష్, ఏఎస్ఐ సుధాకర్ ఉన్నారు