

బీసి గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్ మణి దీప్తి మార్చి 31, 2025 గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహణ జనం న్యూస్, మార్చి -18, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ) గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని , మార్చి 31, 2025 గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బీసి గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్ మణి దీప్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నడిచే బీసీ బాలికల బాలుర పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6,7,8,9 (ఇంగ్లీష్ మీడియం) తరగతులలో ఖాళీ సీట్లలో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానించి నట్లు తెలిపారు.ఆసక్తి గలవారు మార్చి 31 లోపు కుల సర్టిఫికెట్ ఆదాయ సర్టిఫికెట్, ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న ఉంటుందని, వివరాలకు https://mgtbcadmissions.org ను పరిశీలించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.