

జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం నడిగూడెం మండలం లోని కాగిత రామచంద్రాపురంలో ఇళ్లు కూల్చుకుండా డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాంబాబుకు కాగిత రామచంద్రాపురం గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. డబుల్ రోడ్డు రహదారి విస్తరణ పనులు 21 అడుగులతోనే నిర్మించాలని, రహదారి విస్తరణకు కేటాయించిన 56 అడుగుల కొలతలను తగ్గించాలని కోరారు..