

జనం న్యూస్ 18 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలో 2019 లో ఏర్పాటు అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇప్పటి వరకు సొంత భవనం లేక విద్యార్థుల బ్రతుకులు రొడ్డుపైకి లాగారని SFI పట్టణ అధ్యక్షులు కార్యదర్శి g సూరిబాబు k రాజు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యల నగరం విజయనగరం అని మాట్లాడుకుంటాం అని అలాంటి విజయనగరంలో పేద విద్యార్దులు విద్య నీ అభ్యసించే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేదని , విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తరగతి గదులు లేక విద్యార్థులకు ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహించడంతో , కోర్సులు పూర్తి అవ్వక అరకొర చదువులు సాగుతున్నాయని విమర్శించారు. కళాశాల తరగతులు సంస్కృత కళాశాలలో నిర్వహిస్తున్నారని , దానితో అటు సంస్కృత కళాశాల విద్యార్దులు ,ఇటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఒక పక్క ల్యాబ్ లు పూర్తి స్థాయిలో జరగక విద్యార్దులు చదువులు ఎందుకు చదువుతున్నారో తెలీకుండా చదువుతున్నారని విమర్శించారు.