Listen to this article

జనంన్యూస్. 18. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లో ఎమ్మార్పీఎస్ దీక్ష.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు 11% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ కొనసాగుతోంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎమ్మార్పీఎస్ ) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ, మాదిగల జనాభా 32 లక్షలుగా ఉండగా, వారికి 11% రిజర్వేషన్లు రావాలని, కానీ ప్రస్తుత కమిషన్ సిఫార్సుల్లో 9% మాత్రమే కల్పించారని పేర్కొన్నారు. అదేవిధంగా కమిషన్ నివేదిక ప్రకారం, ఎస్సీ కులాలను మూడు (ఏ బి సి) గ్రూపులుగా విభజించి, గ్రూప్-2లో ఉన్న మాదిగలకు 9% రిజర్వేషన్లు సిఫార్సు చేశారు. కానీ, మాదిగ నేతలు ఈ పంపిణీ పద్ధతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, మాదిగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారo ఏ బి సి డి. రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా మాదిగలను మోసం చేస్తే మాత్రం రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. దీనికి మద్దతుగా ఈరోజు సిరికొండ గ్రామంలో ఎమ్మార్పీఎస్ సిరికొండ మండల అధ్యక్షులు మొట్టల దీపక్ అధ్యక్షతన నిరావేదిక నిరసన దీక్షకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు మరియు సిరికొండ మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..