Listen to this article

జనం న్యూస్ జనవరి 13 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం,గోకులాల ఏర్పాటుతో వ్యవసాయానికి సాయంగా ఉంటుందని మంత్రి సవితమ్మ తెలిపారు.గోరంట్ల మండలం తిప్పారాజుపల్లి గ్రామంలో రైతు లక్ష్మీబాయి యొక్క గోకులం షెడ్ నుప్రారంభించిన మంత్రి సవితమ్మ. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పల్లెపండుగ – పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా MGNREGS పథకంలో ఒక్కో యూనిట్ విలువ 2లక్షల 30వేల రూపాయలతో మంజూరైన గోకులం షెడ్స్ ను ప్రారంభించామని రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలనేదే గోకులాల పథకం ఉద్దేశం అన్నారు. గత వైకాపా ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే కూటమి ప్రభుత్వం పల్లె పండుగ, గోకులాలు, పింఛన్ల పెంపు, సకాలంలో జీతాలివ్వడం,అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తుందని మంత్రి తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించామని, రూ.4,500 కోట్ల విలువ గల పనులకు అనుమతి తీసుకుని, 23,588గోకులాలు, 3,500 కి.మీ సీసీ రోడ్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,588 గోకులం షెడ్స్ 514 కోట్లతో,సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 1,302 గోకులం షెడ్ల కు గాను 29 కోట్ల29 లక్షల రూపాయల అదేవిదంగా పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా209 గోకులం షెడ్లకు గాను 4.68 కోట్ల రూపాయల తోనిర్మిస్తున్నామని తెలిపారు…ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ,కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు…